పల్లవి :
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ....
బుజ్జి బుజ్జి పాపాయీ... బుల్లి బుల్లి పాపాయీ....
నీ బోసి నవ్వులలో
పూచే పున్నమి వెన్నెలలోనే
॥బుజ్జి॥
చరణం : 1
పాలుగారు ప్రాయంలో
నీలాగే ఉన్నాను
బంగారు ఊయలలో పవళించి ఊగేను
ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే
॥బుజ్జి॥
చరణం : 2
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా
ఏ తల్లి కన్నదో...
ఏ బంధమున్నదో...
మనసే మురిసెనురా
మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో
పూచే పున్నమి వెన్నెలలోనే
॥బుజ్జి॥
చరణం : 3
పూవంటి మనసులో ముల్లున్న జగతిరా
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా
॥
నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు (2)
పాపాయిగా ఉంటే బాధలే ఉండవురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే
॥బుజ్జి॥
చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్