పల్లవి:
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
చరణం 1:
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది
నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
వగలమారి వాలుచూపు వొర్రగున్నది
అది వెంటపడితె ఏదేదో వెర్రిగున్నది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చరణం 2:
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది
సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ ఈ ఈ..
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది
సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చరణం 3:
వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది
అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...
అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా..
చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా... చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల