మనసు మరిగి శిలలే కరిగే
ఈ రామాంజనేయ సమరంలో
సెగలు రగిలి చెలిమే చెదిరే
ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో
దోషి ఎవ్వరు..నిర్దోషి ఎవ్వరు
తెగదు ఈ వివాదం
విధికి ఇది ఏమి వినోదం
కాటేయమనే కర్తవ్యం
కాపాడమనే బాంధవ్యం
ఏది గెలిచినా ఎదకు తప్పునా
మాయని పెనుగాయం
ధర్మ నిర్ణయం చెయ్యగలుగునా
ఆత్మసాక్షి సైతం
మంచికి మమతకు ఎటు మొగ్గాలో
చెప్పదు ఈ శూన్యం
కన్నతండ్రి కంటి నీటిలో
నీతి కరిగిపోవాలా
న్యాయమూర్తి కలంపోటుతో
వంశనాశనం జరగాలా
తెగదు ఈ వివాదం
విధికి ఇది ఏమి వినోదం
దోషి ఎవ్వరు..నిర్దోషి ఎవ్వరు
వికటించిన, విధి ఆడించిన
ఈ చదరంగంలో
అయ్యినవాళ్ళే అటు ఇటు
ఈ రణరంగంలో
సత్య అసత్యాలకు మధ్య
నిత్య కురుక్షేత్రం
పార్ధుని యెదలో విషాదయోగం
ఈ ధర్మక్షేత్రం
బాట చూపు భగవద్గీతే
అవినీతిని బోధిస్తే
భగవానుడి రధసారధ్యం
పాపం వైపే నడిపిస్తే
దోషి ఎవ్వరు..నిర్దోషి ఎవ్వరు
తెగదు ఈ వివాదం
విధికి ఇది ఏమి వినోదం
చిత్రం - దోషి-నిర్దోషి (1990)
సాహిత్యం:- సిరివెన్నెల
సంగీతం:- విద్యాసాగర్
గానం:- బాలు
********************
manasu marigi SilalE karigE
ee raamaanjanEya samaramlO
segalu ragili chelimE chedirE
ee SreekRshNaarjuna yuddhamlO
dOshi evvaru..nirdOshi evvaru
tegadu ee vivaadam
vidhiki idi Emi vinOdam
kaaTEyamanE kartavyam
kaapaaDamanE baandhavyam
Edi gelichinaa edaku tappunaa
maayani penugaayam
dharma nirNayam cheyyagalugunaa
aatmasaakshi saitam
manchiki mamataku eTu moggaalO
cheppadu ee Soonyam
kannatanDri kanTi neeTilO
neeti karigipOvaalA
nyaayamoorti kalampOTutO
vamSanaaSanam jaragaalaa
tegadu ee vivaadam
vidhiki idi Emi vinOdam
dOshi evvaru..nirdOshi evvaru
vikaTinchina, vidhi aaDinchina
ee chadarangamlO
ayyinavaaLLE aTu iTu
ee raNarangamlO
satya asatyaalaku madhya
nitya kurukshEtram
paardhuni yedalO vishaadayOgam
ee dharmakshEtram
baaTa choopu bhagavadgeetE
avineetini bOdhistE
bhagavaanuDi radhasaaradhyam
paapam vaipE naDipistE
dOshi evvaru..nirdOshi evvaru
tegadu ee vivaadam
vidhiki idi Emi vinOdam
Movie name- dOshi-nirdOshi (1990)
Lyricist- sirivennela
Music director:- vidyaasaagar
Singer : S.P.balu