పల్లవి :
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్నుచూడకా

అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్నుచూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండగా

చరణం : 1
గోరువెచ్చని ఊసుతో చిన్న బుచ్చక నీ వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాల
ఏకమై ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్నుచూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్నుచూడకా
చరణం : 2
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ...
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్నుచూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్నుచూడకా
చిత్రం : అంతఃపురం (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఇళయరాజా, చిత్ర