పల్లవి:
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా

చరణం 1:
కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను

కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
చరణం 2:
కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు
కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట

మత్తు తెలిసిన చందురూడా...మసక వెలుగే చాలు లేరా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
చరణం 3:
అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది

చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట

తీపి మాపుల చందురూడా... కాపువై నువ్వుండి పోరా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా
కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల