నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ కవ్వించని కవ్వించని కవ్వించనీ
కళ్ళు కళ్ళు మూసుకున్నా హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరి పోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా
ఆడించి పాడించి అనురాగం కురిపించీ అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమా
ప్రేమలకు హద్దు లేదులే దాన్ని ఎవ్వరైన ఆపలేరులే
నీ పిలుపే ప్రేమగీతం
జాతి లేదు మతము లేదు కట్నాలేవి కోరుకోదు ప్రేమా
ఆది లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమా
ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమా
నాలోనా నీవుండి నీలోనా నేనుండి జీవించేదే ప్రేమా
జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైనా వీడిపోదులే
నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై కలలు కనే పసి మనసులై
కవితలు పాడీ కవ్వించని కవ్వించని కవ్వించనీ
చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవా
రచన : భువనచంద్ర
గానం : ఉన్నికృష్ణన్ , చిత్ర
*************************************
Nee pilupe prema geetam.... nee paluke prema vedam
asale basalai kalalu gane pasi manasulai
kavitalu paadi kavvinchanii kavvinchanii kavvinchanii
kallu kallu musukunna hrudayamto matladunamma premaa
niddura chediripoyenammaa nestam kosam vetikenamma premaa
adinchi padinchi anuragam kuripinchi alarinchede prema
rammante pommantu pommante rammantu kavvinchede prema
premalaku haddu ledule danni yevvaraina apalerule
jati ledu matamu ledu katnaalevi korukodu prema
adi ledu antam ledu lokamantaa tanai vundunu prema
vuredo peredo kannolla usedo adagadu ninnu prema
nalona neevundi nelona nenundi jeevinchede prema
jatakalu chudabodule yenni janmalaina veedipodule
Nee pilupe prema geetam.... nee paluke prema vedam
asale basalai kalalu gane pasi manasulai
kavitalu paadi kavvinchanii kavvinchanii kavvinchanii
Movie Name : Premalekha (1996)
Music Director : Deva
Lyricist : Bhuvanachandra
Singers : Unnikrishnan, Chitra