పల్లవి:
నా మనసే గోదారి నీ వయసే కావేరి
నా మనసే గోదారి నీ వయసే కావేరి
బోల్ రాధా బోల్ రెండూ కలిసేనా లేదా
అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా
నా మనసే గోదారి నీ వయసే కావేరి
బోల్ రాధా బోల్ రెండూ కలిసేనా లేదా
అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా
నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు
నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు
అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు
దద్దమ్మవు దొరికావు...శుద్ధ మొద్దువి దొరికావు
చరణం 1:
కృష్ణుడు నేనే రుక్మిణి నీవే రాతిరి ఎత్తుకు పోతాను
లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచిపోదాము
మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం
బోల్ రాధా బోల్ గండం తప్పేనా లేదా
అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా
చరణం 2:
లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యె
ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె
మనసే ఠారెత్తె మా ప్రేమయే జావై పోయెను
గుండెలే పగిలి చద్దామింక దిక్కెవ్వరో....
పోవే శాకినీ ఢాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ...
చరణం 3:
బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా
బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా
బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా....
రోగం కుదిరిందా లేదా....
చిత్రం : అదృష్టవంతులు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల, సుశీల