పల్లవి :
కనులు పలుకరించెను...పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను
చరణం : 1
నిన్ను నేను చూసేవేళ...
నన్ను నీవు చూడవేల (2)
నేను పైకి చూడగానే... నీవు నన్ను చూతువేల
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
॥
చరణం : 2
మొలక నవ్వు దాచుకోకు... జిలుగుపైట జారనీకు (2)
కురులు చాటు చేసుకోకు... తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
॥
చరణం : 3
అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం
ఒహొహో ఒహొహో... ఒహొహో...
అందమైన ఈ జలపాతం... ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో...
వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
॥
చిత్రం : ఆడబ్రతుకు (1965)
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : పి.బి.శ్రీనివాస్