ఈ బంధనాల నందనాన్ని నీరు పోసి పెంచిన పైవాడు
తన కోవ్వెలంటి కాపురాన్ని చేతులార పాడుచేసి ఏం సాధించాడు
ఈ అందమైన బొమ్మరిల్లు
ఊరువాడ కళ్ళవిందు చేసిందిన్నాళ్ళు
ఏ చూడలేని పాడుకళ్ళ దిష్టి కొట్టి
కుప్పకూలిపోయింది ఈనాడు
మనిషే దేవుడై మసలే లోగిలి
కలికాలనికి తగదేమోనని
సందేహించి ఆ దైవము
చేసేడా ఈ ద్రోహము
రెండు రూపులున్నా ఒక్క ఊపిరయ్యే బంధం గొప్పదా
రెప్పపాటులోనే బుగ్గిపాలు చెసే పంతం గొప్పదా
ప్రేమంత బలహీనమా
పగసాధిస్తే ఘనకార్యమా
మమకారాలు బలిచేస్తే సంతొషమా
ఇది నీ సృష్టిలోపం సుమా
దయలేని ఓ దైవమా
మావిడాకుతోరణం, మల్లేపూలమండపం కలగా మిగులునా
పచ్చనైన పందిరే చిచ్చురేపు కక్షతో చితిగా రగులునా
కోరింది కళ్యాణమా
కానున్నది కల్లోలమా
కసికాటేసి పోయేటి ఓ కాలమా
పసిప్రాణలతో జూదమా
నీ వేట చాలించుమా
చిత్రం : శుభమస్తు (1995)
సంగీతం:- కోటి
రచన : సామవేదం షణ్ముఖ శర్మ
గానం:- బాలు
*************************
ee bandhanAla nandanAnni neeru pOsi penchina paivADu
tana kOvvelanTi kApurAnni chEtulAra paaDuchEsi Em saadhinchADu
ee andamaina bommarillu
ooruvADa kaLLavindu chEsindinnALLu
E chooDalEni pADukaLLa dishTi koTTi
kuppakoolipOyindi eenADu
manishE dEvuDai masalE lOgili
kalikAlaniki tagadEmOnani
sandEhinchi aa daivamu
chEsEDA ee drOhamu
renDu roopulunnA okka oopirayyE bandham goppadA
reppapATulOnE buggipAlu chesE pantam goppadA
prEmanta balaheenamA
pagasaadhistE ghanakaaryamA
mamakArAlu balichEstE santoshamA
idi nee sRshTilOpam sumA
dayalEni O daivamA
mAviDAkutOraNam, mallEpoolamanDapam kalagA migulunA
pacchanaina pandirE chicchurEpu kakshatO chitigA ragulunA
kOrindi kaLyANamA
kAnunnadi kallOlamA
kasikATEsi pOyETi O kAlamA
pasiprANalatO joodamA
nee vETa chaalinchumA
Movie name: Subhamastu (1995)
Lyricist : sAmavEdam shaNmukha Sarma
Music director - kOTi
Singer - bAlu