పల్లవి :
వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్లాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా॥
చరణం : 1
ఒకే పెదవితో పదములు ఎప్పుడూ పలకవని
ఒకే పదముతో పరుగులు ఎప్పుడూ సాగవని
ఒకే చేతితో చప్పట్లన్నవి మోగవని
ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవని
జతలోన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
జతలోన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా
॥
చరణం : 2
వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా
నీలోన దాగున్న నాకోసం వస్తున్నా
నీ మౌనరాగంలో మంత్రమై వస్తున్నా
నీ ప్రేమయాగంలో జ్వాలనై వస్తున్నా
నీ మెడలోన నిత్యం నిలిచే సూత్రాన్నై వస్తున్నా
అణువణువణువున ఎగసిన అలలను
నేడే గమనిస్తున్నా
ఆ అలలను కలలుగ మలిచిన మహిమే
నీదని గుర్తిస్తున్నా
కలలకు వెల్లువ రప్పించి
ఊహకు ఉప్పెన అందించి
ఆశల అలజడి పుట్టించి
అన్నింటినీ ప్రేమకు జతచేసి
నీ మది నది చేరగా కడలిని నేనై కదిలొస్తున్నా
॥మౌనరాగంలో॥
చిత్రం : బాస్ (2006)
సంగీతం : కళ్యాణిమాలిక్
రచన : చంద్రబోస్
గానం : కె.కె., సునీత