పల్లవి :
వేళచూడ వెన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె॥
చరణం : 1
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె
గుండె నిండా గుబుళ్లాయె॥
పువ్వు పువ్వున తుమ్మెదాయె
పొంగు వయసుతో పోరులాయె॥
చరణం : 2
కునుకుపడితే ఉలికిపడుతాయె
కునుకుపడితే ఉలికిపడుతాయె
మెలుకువైతే కునుకు రాదాయె
వల్లమాలిన వగలతోటే
ఘల్లుఘల్లున తెల్లవారె॥
చరణం : 3
సరసమెరుగని చందమామ
చాటుమాటుగ సాగిపోయే॥
వెంటనున్న చుక్క కన్నె
జంటవుండీ ఒంటరాయె॥॥
చిత్రం: నాటకాల రాయుడు (1969)
సంగీతం : జి.కె.వెంకటేష్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.సుశీల
*********************************
Movie Name : Natakala rayudu (1969)
Music Director : G.K.Venkatesh
Lyricist : Aathreya
Singer : P.Susheela