పల్లవి :
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైనా
మాసిపోదు చితిలోనైనా॥
చరణం : 1
ఆడవాళ్లు ఆడుకునే
ఆటబొమ్మ ఈ మగవాడు (2)
ఆడుకున్నా ఫరవాలేదు...
పగులగొట్టి పోతారెందుకో (2)॥
చరణం : 2
మగువలను పుట్టించావే
మా సుఖమునకే అన్నావే
అందుకే ధర తెమ్మన్నావే...
బ్రతుకే బలి ఇమ్మన్నావే (2)॥
చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్