పల్లవి : హాయ్ ఆర్ యూ సింగిల్?
అయామ్ యువర్ డ్రింక్
హే లెట్స్ గో అవుట్ మ్యాన్
యువర్ ప్లేస్? ఆర్ మైన్?
చెలి చెమకు కనులు
వల వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి
నను పిలిచెనులే జతగా జతగా
పసి నడుమే నయగారాలు
అడుగేసే నను చేర ॥
చరణం : 1 సింహమల్లే పొగరు ఉంది
నన్ను గిచ్చి చంపుతుంది
చెక్కిలి నొక్కా చేరగ పక్క
హే... వన్నెచిన్నె ఉన్న కన్నె
లాగమాకే పైకి నన్నే
సెగతో నా మతిపోయెనా
నీ పరువం మడతడి పోవులే
అంత మగసిరి నీలోనా
ఉన్నది కద మరి రావా
చప్పునొచ్చెయ్ వచ్చి వార్పెయ్
చురకలే వేసేయ్
అంతగ త్వరపడలేనులే
నా మదిలో చోటిక లేదులే
ఆడుకో కథకళి ఆటలే పాడుకో
చలిగిలి పాటలే ॥
చరణం : 2
హే... రూపు చూపి కవ్విస్తారు
గుండె పిండి చంపుతారు
మగువల జన్మ అరె ఏంటిర బ్రహ్మా
హే... అవును అంటే కాదు అనెలే
కాదు అంటే అవును అనెలే
చల్లగ అల్లుకుపోవులే
మా చూపుల భాషలు వేరులే
ఆశ కలిగెను నీ పైన
అల్లరి పెరిగెను లోన
దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు
గుప్పెడు మనసున ఆశలు
నెరవేరవు పూర్తిగ ఊహలు
చెప్పకు పొడిపొడి మాటలే
అనుకున్నది అందితే హాయిలే
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
రచన : కందికొండ
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : అద్నాన్ సమి, అనుష్క, శ్వేత