పల్లవి :
యాతమేసి తొడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తొడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా
గాలి ఇసిరి కొడితె
ఆ దీపముండదు ఆ దీపముండదూ
యాతమేసి తొడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చరణం : 1
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయెరా
కుడితి నీళ్ళు పోసినా అది పాలుకుదుపుతాది
కడుపు కోత కోసినా అది మడిషికే జన్మ ఇత్తాది
బొడ్దు పేగు తెగి పడ్డ రోజు తలసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తొడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చరణం : 2
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మెడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాక పాడె ఒక్కటె వల్లకాడు ఒక్కతే
కూత నేర్చినోల్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా
యాతమేసి తొడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
చిత్రం : ప్రాణం ఖరీదు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : జాలాది
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
*************************************
Movie Name : Praanam Khareedhu (1978)
Music Director : Chakravarthy
Lyricist : Jaladi
Singer : S.P.Balasubramanyam