ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
ఎ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఎ రెక్కలతో ఎగిసి వచ్చినా, నిలువగలన నీపక్కన
ఆకాశమా నీవెక్కడ, అవని పైనున్న నేనెక్కడా
నీలాల గగనాల ఓ జాబిలి,
నిన్ను నిరుపేద ముంగిట నిలిపేది ఎల?
నీలాల గగనాల ఓ జాబిలి,
నిన్ను నిరుపేద ముంగిట నిలిపేది ఎల?
ముళ్ళున్న రాలున్న నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేది ఎల?
నీ మనసన్నది నా మది విన్నది,
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
ఆకాశమా... లేదక్కడ
ఆకాశమా లేదక్కడ, అది నిలిచి వున్నది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ, అది నిలిచి వున్నది నీపక్కన
వెలలేని నీ మనసు కోవెలలో నన్ను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నన్ను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమతా కాంతులు ప్రతి దిక్కున
ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా, వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఈ నేలపైనే తన మక్కువ
చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : చక్రవర్తి
రచన : సి.నారాయణ రెడ్డి
గానం :ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్. జానకి