ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా
ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా (2)
బడిలో మీకిక చదువే లోకం
బలపం పట్టే వేళా గురువే దైవం
పెరిగే ఈడున న్యాయం నేరం
కలలే కన్నీళ్ళైతే బతుకే భారం
నేర్చిన అర్ధాలన్నీ మారిపోయేను
పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను
ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు
నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను
చేతులు కలపండిరా.. సైనికులై లెండిరా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా
కదిలే కాలమై గమనం సాగి
యదలో ధ్యేయం కోసం సమరం రేగి
రగిలే గాయమై పొగిలే ప్రాణం
పగిలే గేయం తానై మిగిలే గానం
కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి
ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి
కష్టాలు లేనట్టి కన్నీళ్ళు రానట్టి
పూల దారుల్లోకి సాగిపోదాము
నేర్పుగా నడవండిరా.. మార్పును కోరండిరా
ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ
వేకువ రావాలమ్మా.. వేదన తీరాలమ్మా
ఓ చిట్టెమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా (2)
చిత్రం : జైత్రయాత్ర (1991)
సంగీతం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం