పంచభూతాల సాక్షిగా
పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా
పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ
పంచేసుకుంటా నీతో ప్రేమనీ
పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఓ... నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఎండ లేక నీడుందా నేల లేక మేడుందా
నీవు లేక నేనంటూ ఉండను ఏనాడు
నీరు లేక ఏరుండా నేడు లేక రేపుందా
నీవు లేక లేనంటూ అడిగా నీ తోడు
ఊపిరిలోని గాలికి బదులు హృదయంలోని లయలకు బదులు అంతా నీ ప్రేమే
దేహంలోని జీవం బదులు కోవెలలోని దైవం బదులు అన్నీ నీ మయమే
మనసారా చెబుతున్నా మనస్సుతో విను ఈ మాటా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఎంత ఆపుకుంటున్నా అంత ఆగలేకున్నా
అంతు లేని అలజడిని నాలో చూస్తున్నా
ఓ.. ఇన్నినాళ్ళ తెరలన్నీ ఇప్పుడైనా తెరుచుకొని
నిన్ను నువ్వు దాటుకుని బయటికి రమ్మన్నా
నాలో ప్రేమను దాచాలన్నా నాటకమేదో ఆడాలన్నా ఆడకపోతున్నా
గాలిని వలలో బంధిస్తావా ప్రేమను మదిలో మూసేస్తావా అయ్యే పనియేనా
నా గుండె గొంతెత్తి నిజమే నీతో చెబుతున్నా
పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా
పంచేంద్రియాల సాక్షిగా పంచాక్షరాల సాక్షిగా
నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
ఓ... నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమనీ
చిత్రం : నీతో (2002)
సంగీతం : విద్యాసాగర్
రచన : చంద్రబోస్
గానం :
***********************************************
Pancha bhoothala sakshiga
Panchamruthala sakshiga
Panchendriyaala sakshiga
Panchaksharaala sakshiga
Naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
Pancha bhoothala sakshiga panchamruthala sakshiga
Panchendriyaala sakshiga panchaksharaala sakshiga
Naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
O.. Naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
Enda leka needundaa nela leka medunda
Neevu leka nenantu undanu yenaadu
Neeru leka yerundaa nedu leka repundaa
Neevu leka lenantu adiga nee thodu
Oopiriloni gaaliki badulu
Hrudayamloni layalaku badulu
Antha nee preme
Dehamloni jeevam badulu
Kovelaloni daivam badulu
Anni nee mayame
Manasaaraa chebuthunna manassutho vinu ee maata
Naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
Entha aapukuntunna antha aagalekunna
Anthu leni alajadini naalo chusthunna
O.. inni naalla theralanni ippudaina theruchukoni
Ninnu nuvvu daatukuni bayatiki rammanna
Naalo premanu dachalanna
Naatakamedo aadaalanna
Aadaka pothunna
Gaalini valalo bandhisthava
Premanu madilo moosesthava
Ayye paniyenaa
Naa gunde gonthetthi nijame neetho chebuthunna
Pancha bhoothala sakshiga
Panchamruthala sakshiga
Panchendriyaala sakshiga
Panchaksharaala sakshiga
Naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
O… naa pancha praanaale neevani
Panchesukunta neetho premani
Movie Name : Neetho (2002)
Music Director : Vidyasagar
Lyricist : Chandrabose
Singer :