పల్లవి:
చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడూ..
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ
చందమామ బాగుంది నేడు.. చల్లగాలి బాగుంది నేడు
ఏముంది.. ఇంక ఏముంది.. అది అంతే కదా ఏనాడు
చందమామ బాగుంది నేడు
చరణం 1:
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు
వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు
తెలుసుకోలేవు నీవూ.. పలకగాలేను నేను
చందమామ రమ్మంది చూడూ
చరణం 2:
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు
ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు
నీది నా దారి కాదు.. నాది నీ దారి కాదు
చందమామ బాగుంది నేడు
చరణం 3:
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు
చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు
అడవి మనిషివి నీవు.. ఆ మాటే తగదన్నాను
చందమామ రమ్మంది చూడు.. చల్లగాలి రమ్మంది చూడు
ఆ పైన.. ఇంక ఆ పైన.. నువ్వు నా కళ్ళలో తొంగి చూడు
చందమామ రమ్మంది చూడు
చిత్రం : అమాయకుడు (1968)
సంగీతం : బి. శంకర్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల, సుశీల