పల్లవి:
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
చరణం 1:
చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ.. చుట్టుకు నేపోనా
చెట్టా పట్టగ కాలంగీలం.. నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ... చుట్టుకు నేపోనా
గిలిలేని కౌగిలిలోన.. చలికి చెలికి చెర వేయనా
కలలూరే కన్నుల్లోన.. తొలి చూపుతో బందీ చేయనా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన
చరణం 2:
పొద్దే తెలియని ముద్దూముచ్చట.. నీలో వింటున్నా
హాద్దే చూడని ఆవేశాలు... నీలో కంటున్నా
పొద్దే తెలియని ముద్దూముచ్చట.. నీలో వింటున్నా
హాద్దే చూడని ఆవేశాలు... నీలో కంటున్నా
వేగం ఉన్నది నాలోనా...బిగువులు ఉన్నవి నీలోనా
ఒదిగి ఒదిగి నీ ఎదలోనా... నేనోడి పోదు నీ ఒడిలోన
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా.. శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా.. శ్రీవారు తందాన తాన
చరణం 3:
పొంగే పొంగుకు కట్టలు వేసి.. నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే.. నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలు వేసి.. నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే.. నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా... సొగసూరించెను పంతానా
పంతాలెందుకు మనలోనా... నీ సొంతం కానని అన్నానా
శ్రీవారేమనుకున్నా... శ్రీమతి తానతందనానా
శ్రీమతి ఏమన్నా..శ్రీవారు తందాన తాన... శ్రీవారు తందాన తాన
ఊహూహు హుహుహుహు....
చిత్రం : అక్కాచెల్లెలు (1970)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, పి. సుశీల