వెలుగూ రేఖలవారు తెలవారి తామొచ్చి
ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకా ముక్కుల వారు చీకటితోనే వచ్చి
చిగురు తోరణం కట్టంగా
మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు
మందార పూవంటి మా బామ్మని
..అమ్మమ్మనీ
నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ
పండంటి ముత్తైదు సందామామా..
పసుపు బొట్టంట మా తాత సందామామ
నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ
కూచను చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓ లాల.. తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల.. గాజులు పాడే ఓ లాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా.. కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏ లాలా..
ఏలాలో ఏలాలా.. ఏలాలో ఏలాలా
దివిటీల సుక్కల్లో దివినేలు మామా సందామామ..సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ..సందామామ
నొమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామ..సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాల బంతి సందామామ..సందామామ
ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరూ తరముల నాటి ఓ పట్టెమంచం
తొలి రాత్రి మలి రాత్రి మూన్నాళ్ళ రాత్రి..ఆ మంచమె పెంచె మీ తాత వంశం...
అరవై ఏళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి..మరలీ రాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవై ఏళ్ళ వాడు నీ రాముడైతే..పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ..పసుపు కుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ
ఆనందమానందమాయెనే..మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే..మా నానమ్మ పెళ్ళికూతురాయెనే
చిత్రం : సీతారామయ్య గారి మనవరాలు (1991)
సంగీతం : M.M.కీరవాణి
రచన :
గానం: జిక్కి, చిత్ర