
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో
నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో
నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
కురిసెను నాలో వలపుల వాన
మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో
నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
నీలాల గగనాన వేచినదో చిరుతార నేడూ
గారాల నెలవంక తోడుగనే నిలిచింది చూడూ
ఏవేవో తమకాలు సుడి రేగె నాలో కమ్మంగా ఒడి చేరి కరగాలి నీలో
తనువే తపించే క్షణాన
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
కౌగిళ్ళ ద్వారాలు తియ్యమనే పిలుపందుకున్నా
శృంగార తీరాలు చేరమనే నిను కోరుకున్నా
ఏనాటి కలలన్ని యద చేరినాయో ఎన్నెన్ని జన్మాల తెర తీసినాయో
నీకై జ్వలించే క్షణాన
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవె సుమా కలకాదు సుమా కురిసెను నాలో వలపుల వాన
మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
చిత్రం : సమరం (1994)
సంగీతం : ఇళయరాజా
రచన : భువనచంద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , చిత్ర
*****************************************
Movie Name : Samaram (1994)
Music Director : Ilayaraja
Lyricist : Bhuvanachandra
Singers : SP.Bala subramanyam, Chitra