తెలంగాణా గట్టు మీద సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
తల్లి మల్లి సెట్టుకేమో సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో..
ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెల పరిమళాలు సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
తెలంగాణా గట్టు మీద తల్లి మల్లి సెట్టుకేమో
ఎర్ర మల్లెలు పుసేనంట ఎర్ర మల్లెల పరిమళాలు
వెదజల్లే పల్లె పల్లె
ఎర్ర మల్లెల పరిమళాలు సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
కొయ్యాలమ్మా కొయ్యాలమ్మా కొయ్యాలో ....మామిడీ ఆకుల్ని కొయ్యాల
పచ్చని తోరణాలే కట్టాల..తన్నారి నారి నన్ని..నన్నా..
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
పల్లెల పందిరి మీద సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
అల్లూకున్న మల్లె తీగ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
తుది మొదలు తెలవకుండ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
పల్లెల పందిరి మీద అల్లూకున్న మల్లె తీగ
తుది మొదలు తెలవకుండ
చిదిమే కొద్ది ఎదిగేనంటా ..కోసే కొద్దీ పూసే నంటా
చిదిమే కొద్ది ఎదిగేనంటా సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
కోసే కొద్దీ పూసే నంటా సందమామయ్యో ..
ఓలా సందమామయ్య..
ఎయ్యాలమ్మా ఎయ్యాలమ్మా ఎయ్యాలో ....సుక్కల పెళ్లి పందిరి ఎయ్యాలా
సక్కంగా పెళ్లిని జరిపించాలా..తన్నారి నారి నన్ని..నన్నారో....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
మల్లెలంటే మల్లెలు కాదు సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
విప్లవాల వీరులమ్మ సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
మండే అగ్గి పుల్లలమ్మ సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
మల్లెలంటే మల్లెలు కాదు విప్లవాల వీరులమ్మ
మండే అగ్గి పుల్లలమ్మ
చావంటే భయం లేదు.. త్యాగాల బిడ్డలమ్మా
చావంటే భయం లేదు సందమామయ్యో ..
త్యాగాల బిడ్డలమ్మా సందమామయ్యో ..
చెయ్యాలమ్మా చెయ్యాలమ్మా చెయ్యాలో ...చిలకా గోరింకల పెళ్లి చెయ్యాల
పెల్లింట్ల పప్పన్నాలే తినాలా ...తన్నారి నారి నన్ని..నన్నారో....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
హోలియ హోలియ హోలో....హోలియ హోలియ హోల ....
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
అరె..భూమి కొరకు భుక్తి కొరకు సందమామయ్యో....ఓలా సందమామయ్య..
సాగే పోరాటానికి సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
సారధులు వారధులై సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
అరె..భూమి కొరకు భుక్తి కొరకు... సాగే పోరాటానికి
సారధులు వారధులై ....
ఎగిరే జెండాలోలె సందమామయ్యో ....ఓలా సందమామయ్య..
ఎరుపెక్కి ఉన్నారంట సందమామయ్యో ...ఓలా సందమామయ్య..
తెలంగాణా గట్టు మీద సందమామయ్యో .. ఓలా సందమామయ్య..
ఎర్ర మల్లెలు పుసేనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్య..
చిత్రం : చీమల దండు (1995)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : వంగపండు ప్రసాద రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్