
ఆ ఆ ఆ ఆ..
మల్లె తీగకి పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెల వోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన ఋణం
తీర్చుకుంటనే చెల్లెమ్మా(నీ పాదం)
పెద్దమనిషివై పూసిన నుండే
ఆడపిల్లకు ఆంక్షలు ఎన్నో
చుసేదానిని చూడొద్దంటరు
నవ్వే చోట నవ్వొద్దంటరు(పెద్ద మనిషివై)
అటువంటి నీ అన్నను గాను చెల్లెమ్మ
నీ చిన్ననాటి స్నేహితుణ్ణమ్మా చెల్లెమ్మ
అడవిలోన నెమలి వోలె చెల్లెమ్మ
ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ(మల్లె తీగకు)
సిన్నబోయి కూసున్నవంటే
ఎన్నుపూస నడ్డిరిగెనమ్మ
ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే
నా కనుపాపలు కమిలిపోతాయి(సిన్నబోయి)
నువ్వు ఒక్క గడియ
మాటాడకుంటే చెల్లెమ్మ
నీ దిక్కు లేని పక్షినైతనమ్మ చెల్లెమ్మ
బువ్వ తినక
నువ్వు అలిగినవంటే చెల్లెమ్మ
న భుజం ఇరిగినంత
పనైతదమ్మ చెల్లెమ్మ(మల్లె తీగకు)
చదివినంత నిన్ను చదివిస్తానమ్మ
ఎదిగినంత నిన్ను ఎదగిస్తానమ్మ
నీకు పెళ్లీడు వచ్చేనాటికి
పువ్వో పట్టో కూడబెట్టుతా(చదివినంత)
నచ్చినోనికే ఇస్తానమ్మ చెల్లెమ్మ
నా కన్నీళ్ళతో కళ్ళు కడుగుతాచెల్లెమ్మ
రిక్షా బండినే మేనాగడతా చెల్లెమ్మ
మీ అత్తోరింటికి సాగనంపుత చెల్లెమ్మ(మల్లె తీగకు)
చిత్రం : ఒరేయ్ రిక్షా (1995)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : గద్దర్
గానం : వందేమాతరం శ్రీనివాస్, మంజుల
********************************************
Movie Name : Orey Rikshaw (1995)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Gaddar
Singer : Vandemataram Srinivas, Manjula