శ్రీ శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి
శ్రీ శ్రీనివాసం శివపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
ఏ స్వప్నలోకల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా మెలికల మేనకా
మనసున చేరెగా కలగల కానుకా
కొత్తగా కోరికా చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో
మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు మునుపెన్నడు లేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు గేయమై తియ్యగా స్వరములు పాడగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
మహరాణి పాదాల పారాణికేనాడు మన్నునంట నీయకా
మహరాణి పాదాల పారాణికేనాడు మన్నునంట నీయకా
నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం ఆమె నెమ్మదీ అందుకే అంకితం అయినదీ మదీ
సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా మెలికల మేనకా
మనసున చేరెగా కలగల కానుకా
కొత్తగా కోరికా చిగురులు వేయగా
ఏ స్వప్నలోకల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచీ ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
చిత్రం : సుస్వాగతం (1998)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
*********************************
Ye swapnalokala soundaryarashi
naa mundukochindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi aa merupu vachhi
ye swapnalokala soundaryarashi
naa mundukochindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi aa merupu vachhi
talatala taaraka melikala menaka
manasuna cherega kalagala kanuka
kotthaga korika chigurulu veyagaa
ye swapnalokala...
tolichoopu chalanta chittana
chitramga premanedi puttaga
tolichoopu chalanta chittana
chitramga premanedi puttaga
padimandi antunte vinnanu innallu
nammaledu bothtigaa
aa kallalo aa navvulo mahima emito
aa kanthilo eenaade naa udayamainado
madhuseemalo enni marumalle gandhalu
munupennaduleni mruduvaina ganaalu
modati valapu kathalu telupu
geyamai teeyaga swaramulu padagaa
ye swapnalokala...
maharani paarani padalakyenadu
mannunantaneeyaka
maharani paarani padalakyenadu
mannunantaneeyaka
nadicheti daarullo naa gunde poobata
paruchukundi mettaga
shanthike aalayam aame nemmadii
anduke ankitham ayinadi madi
sukumarame aame chelikatte kaabolu
sugunalake aame talakattu kaabolu
cheliya chaluva chelimi koraku
ayuvee ashagaa tapamulu cheyagaa
ye swapnalokala soundaryarashi
naa mundukochindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi aa merupu vachhi
talatala taaraka melikala menaka
manasuna cherega kalagala kanuka
kotthaga korika chigurulu veyagaa
ye swapnalokala...
Movie Name : Suswagatham (1998)
Music Director : S.A.Raj kumar
Lyricist : Sirivennela Sitarama sastry
Singers : S.P.Bala subramanyam