సుస్వాగతం నవరాగమా
పలికిందిలే ఎద సరిగమా
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా
ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా
పిందల్లె రాలే పువ్వ చిన్నిచిన్ని నవ్వులివ్వా
నీకోసం ప్రాణం పెట్టే చిన్నవాడి చేరవా
సుస్వాగతం నవరాగమా
అంతేలేని వేగంతోనె ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేనె ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోనే మునిగి పోతుంటే
ఇంక క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే
ఆ చేతులే నీకు పూలదండగా మెడలోన వేసే నీ జత చేరగా
నా చూపు సుఖంగ ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలగా
మౌనమే మాని గానమై పలికె నా భావనా
ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా ఆ ..ఆ .. ఆ పనిసగా నినిసా
శిలలాంటి గుండె కాస్త శిల్పమల్లె మారిపోయె చిత్రాల ప్రేమ దాచె సంధ్యవేళ వేళలో
సుస్వాగతం నవరాగమా
సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికీ
రేయి ఉన్నాదమ్మా కలలో నిన్నే చేరడానికీ
మాటా మనసు సిద్ధం నీకే ఇవ్వడానికీ
నా కళ్ళు పెదవి ఉన్నాయ్ నీతొ నవ్వడానికీ
ఏనాడు చూశాను రూపురేఖలూ ఆనాడె రాశాను చూపులేఖలూ
ఏరోజు లేదమ్మ ఇన్ని వింతలూ ఈవేళ నా ముందు ప్రేమ పుంతలూ
ఏడు వింతలను మించే వింత మన ప్రేమే సుమా
ఆ .. ఆ ..ఆ పనిసగా నినిసా ఆ .. ఆ .. ఆ పనిసగా నినిసా
వచ్చింది పూల మాసం చిన్న వాడి ప్రేమకోసం
అందాల నీలాకాసం అందచంద సంబరం
సుస్వాగతం నవరాగమా పలికిందిలే ఎద సరిగమా
ప్రియ దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తొలి స్పర్శలో ఇంత సుఖ మైకమా
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం నవరాగమా
చిత్రం : సుస్వాగతం (1998)
సంగీతం : S.A.రాజ్ కుమార్
రచన : సామవేదం షణ్ముఖ శర్మ
గానం : హరిహరన్ , చిత్ర
*********************************
Movie Name : Suswagatham (1998)
Music Director : S.A.Raj kumar
Lyricist : Samavedam Shanmukha sharma
Singers : Hariharan ,Chithra