నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే
ఆ గీతమే తియ్యగా పాడనా
అ ....
నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా
చుక్కలన్నీ ఒక్కటైతే చిత్రము
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కావ్యము
గితలన్ని చిత్రమందు భాగమే
మాటలన్నీ ప్రేమ ముందు మౌనమే
ఆ నింగి రంగు నిలమంటా
మన ప్రేమ రంగు ఎమిటంటా
నీ కుంచేలకే చూప్పోచే
రేఖలకే రూప్పోచే
మన ప్రేమను చిత్రించేనా
నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా
చిత్రమందు జీవమేక్కడున్నది
చెలియా సోగ కళ్ళలోనే వున్నది
తనువులోన ప్రేమ ఎక్కడున్నది
చూపు పడని చోట దాగి వున్నది
నీ చిత్రమందు ఓ చిత్రముంది
నీ మాటలోన మధుమంత్రముంది
తెలిమబ్బు తెరెక్కి ఇల చేరే జాబిలివా
జత చేర చెలియా నువ్వు రా
నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే
ఆ గీతమే తియ్యగా పాడనా ....
చిత్రం : సత్యమే శివం (2002)
సంగీతం : విద్యాసాగర్
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు , చిత్ర