గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ
నీ వైపల చూస్తుంటె ఆకలేయకుందీ
నీ చూపులొ బంధించె మంత్రమేమున్నదీ
నీ మాటలే వింటుంటె రోజు మారుతుందీ
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నదీ
మనసెందుకొ ఇలా మూగవోతోంది రాప
తెలియదు
మరుమల్లె పూవులా గుప్పుమంటోంది లోన
తెలియదు
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదూ
నీ నీడలొ నేనున్న చూడమంటున్నదీ
ఈ హాయి పేరేదైనా కొత్తగా ఉన్నదీ
నా కంటినె కాదన్నా నిన్ను చూస్తున్నదీ
నేనెంతగ వద్దన్న ఇష్టమంటున్నదీ
మరి దీనినే కద లోకమంటుంది ప్రేమ
తెలియదూ
అరె దూరమంటూనే చేరువౌతుంది రామ
తెలియదూ
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే
గుడి గంటలా నవ్వుతావేల
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేల
తెలియదు ...
చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : ఎస్.పి.బి.చరణ్ , ఉష