ఓ.. ఓ.. ఓ.. ఓ...
నెలరాజా..ఆ.. ఇటు చూడరా
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
తగువేళరా ..తగవేలరా ..రవితేజా !
నవరోజా..ఆ.. తెర తీయవా..
నవరోజా..ఆ.. తెర తీయవా..
చరణం 1:
నీ కోసం ఆశగా నిరీక్షించే ప్రాణం..
నీ చేతుల వాలగా చిగిర్చింది ప్రాయం ...
నీ వైపే దీక్షగ చెల్లించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించే జీవం
నివాళిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషేదించనా
రతి రాజువై జత చేరవా
విరి వానవై నన్ను తాకవా
నవరోజా.. తెర తీయవా..
నవరోజా... తెర తీయవా..
దివి తారక నన్ను చేరగ నిన్ను చూచా
జవనాలతో జరిపించవే జత పూజా
నెలరాజా..ఆ.. ఇటు చూడరా
నెలరాజా..ఆ.. ఇటు చూడరా..
ఈ వెన్నెల సాక్షిగా యుగాలాగిపోని
ఈ స్నెహం జంటగా జగలేలుకోని
నీ కన్నుల్లో పాపగా కలల్లో ఆడుకోనీ
నీ కౌగిలి నీడలో సదా సాగిపోని
ప్రపంచాల అంచులుదాటి ప్రయాణించనీ
దిగంతాల తారలకోట ప్రవేశించనీ
గతజన్మనే బ్రతికించని
ప్రణయాలలో శ్రుతిపెంచని
నెలరాజా... ఇటు చూడరా
నవరోజా.. తెర తీయవా..
ఉలుకేలరా కులుకేలరా వలరాజా
జవనాలతో జరిపించవే జత పూజా
చిత్రం : సూర్య I.P.S (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం