పల్లవి :
కదిలింది శ్రీ సాయి పల్లకి
కరుణామయుని పూల పల్లకి
అది శుభ కారిణి ఆత్మ విహారిణి
ఆనంద పద సంచారిణి || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చరణం : 1
సాయి పాదుకలు ఎదపై నిలిపి (2)
సాగెను పల్లకి నేడు
పల్లకి వెంటా చల్లగా కదిలెను
బాబా పదములు చూడు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చరణం : 2
ద్వారక దాటి తరలిన పల్లకి (2)
చేరెను చావడి ముందు
ప్రమథుల నడుమా పరమ శివునిలా
బాబా వేసెను చిందు (2) || కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చరణం : 3
అటు తాళాలు, యిటు మేళాలు
ఆడే భక్త గణాలు (2)
పల్లకి ఉత్సవం చూసిన చాలు
కరుగును పాషాణాలు (2) ||కదిలింది ||
సాయి రామ హరే ! సాయి కృష్ణ హరే !
జయ జయ సాయి సాయి హరే హరే !
చిత్రం : శ్రీ సాయి మహిమ (2000)
సంగీతం : ఆదిత్యా పౌడ్వాల్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఎస్.పి.బాలు , జానకి