వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ

ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి
ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిది అలివేణీ
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
అల్లసాని వారిదంత అవకతవక టేస్టు గనక
వెల్లిపోయేనే చల్లగా ప్రవరుడూ
వరూధినిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరే
విడిచి పెట్టునా భామినీ బ్రాహ్మడూ
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వేయలేరు ఎవరు
కాపురాలు గంగకొదిలి వెంటపడుతారే

ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావొ ఏమో వయ్యారీ
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
చిత్రం : సూర్య I.P.S (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం