పల్లవి :
ఏడుకొండలవాడ వెంకటారమణా
ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుచేయక నీవు నిదురపోవయ్యా
చరణం : 1
పాలసంద్రపుటల పట్టెమంచముగా
పున్నమీవెన్నెలలు పూలపానుపుగా
పాలసంద్రపుటల పట్టెమంచముగా
పున్నమీవెన్నెలలు పూలపానుపుగా
కనులలొలికే వలపు పన్నీరుజల్లుగా
అన్ని అమరించెనే అలువేలుమంగా
అన్ని అమరించెనే అలువేలుమంగా
ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుచేయక నీవు నిదురపోవయ్యా
చరణం : 2
నాపాలిదైవమని నమ్ముకొన్నానయ్య
నాభాగ్య దైవమా నను మరువకయ్యా
బీబినాంచారమ్మ పొంచివున్నాదయ్య
బీబినాంచారమ్మ పొంచివున్నాదయ్య
చాటుచేసుకొని ఎటులో చెంతచేరదనయ్య
చాటుచేసుకొని ఎటులో చెంతచేరదనయ్య
ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుచేయక నీవు నిదురపోవయ్యా
చిత్రం : పెళ్లి చేసి చూడు (1952)
సంగీతం : ఘంటసాల
రచన : పింగళి
గానం : పి.లీల