పల్లవి:
అందమే ఆనందం... అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం:
పడమట సంధ్యారాగం...
కుడి ఎడమల కుసుమపరాగం...
పడమట సంధ్యారాగం...
కుడి ఎడమల కుసుమపరాగం...
ఒడిలో చెలి మోహన రాగం...
ఒడిలో చెలి మోహన రాగం...
జీవితమే మధురానురాగం...
జీవితమే మధురానురాగం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
చరణం:
పడిలేచే కడలితరంగం... ఓ... ఓ...
పడిలేచే కడలితరంగం...
వడిలో జడిసిన సారగం...
వడిలో జడిసిన సారగం...
సుడిగాలిలో... ఓ.. ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం...
జీవితమే ఒక నాటక రంగం...
జీవితమే ఒక నాటక రంగం...
అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...
ఓ... ఓ... ఓ...
చిత్రం: బ్రతుకుతెరువు (1953)
రచన: సముద్రాల సీనియర్
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల