సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు
సుడిలో పడవై ఎపుడూ తడబడకు
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవిదే నీ కళ్లు
కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
ఛలో ఛలో
నిన్నే చూసే అద్దం కూడ నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటు లోకం ఉలికిపడదా
సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుళ్ళో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదే నీలా నవ్వే క్షణాలలో
చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసి
తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి
అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికి బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు
ఛలో ఛలో
చిత్రం : హరే రామ్ (2008)
సంగీతం : మిక్కీ జే మియర్
రచన : సిరివెన్నెల
గానం : కార్తీక్