పల్లవి:
విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా
పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా
ఈ దేశం అందించే ఆదేశం నీకేరా
ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా
రేపు మాపు నీవేరా
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
తలకుల తారల్లో వెలుగుల ధారల్లో
మనసా గెలుపు నీదేరా.... నీదేరా...
చరణం:
మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక
పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా
ప్రతి రోజు నీకొక పాఠమే
చదువుకుంటూ పద
ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా
||మనసా గెలుపు నీదేరా||
చరణం:
ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా
ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా
దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల
బొమ్మలాటే కదా
||మనసా గెలుపు నీదేరా||
చిత్రం: గోదావరి (2006)
రచన: వేటూరి
సంగీతం: కే. ఎం. రాధాకృష్ణన్
గానం: శంకర్ మహాదేవన్, చిత్ర