మనిషి పుట్టినాక పుట్టింది మతము
పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము..
తల్లి కడుపులో వెల్లినట్టి మనిషి
తలచకురా ఏ చెడ్డ గతము..
నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
హొయ్.. మనరోజు మనకుంది మన్నయా
నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
అరె .. మనరోజు మనకుంది మన్నయో
అనువు గాని చోట నువ్వు అధికుడన్న మాట
అనవద్దు నంట నన్న వేమన్న గారి మాట
వినలేదా నువ్వు బేటా ...బంగారు పలుకు మాట
హెయ్..నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
చరణం : 1
అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే
రామదాసు రాముని గుడి కట్టేనుగా..
కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా
భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా..
నవాబులు నిర్మించిన నగరము లందు..
నవాబులు నిర్మించిన నగరము లందు..
కులమతాల గొడవలు మనకెందుకురన్నా
ఇంకెందుకురన్నా ...
హెయ్..నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
చరణం : 2
విన్నావా సోదరుడా..
మొన్న నీకు ధవఖానాలో జరిగినట్టి సంఘటన
మానవతకు మచ్చ్సుతునక..
తన చావుతో ముస్లీము..మన హిందూ సోదరులకి
ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా..
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా..
మనుషుల్లో సైతానులకు పట్టదన్నా .. ఇది పట్టదన్నా .,.
హెయ్..నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
హొయ్ .. మనరోజు మనకుంది మన్నయా
చరణం : 3
పీర్ల పండగోచ్చిందా ..ఊర్లల్లో మనవాళ్ళు
డప్పుల దరువేసుకుంటూ కోలాటలు ఆడుతారు..
సదరు పండగోచ్చిందా..పట్నంలో ప్రతివారు
దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు
ఎవడేమి అంటే మనకేమిటన్నా
ఎవడేమి అంటే మనకేమిటన్నా
జాషువా విశ్వనరుడు నువ్వే రన్నా ..ఎప్పుడు నువ్వేరన్నా..
హెయ్..నారాజు గాకురా మా అన్నయా
నజీరు అన్నయా ముద్దుల కన్నయా
హొయ్ .. మనరోజు మనకుంది మన్నయో
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు..
మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు..
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు..
మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు..
దేవుళ్ళని అడ్డంగా పెట్టి.. నాయకుడు
దేవుళ్ళనే దోచేస్తాడమ్మో నాయకుడు..
అధికారం , తన పదవి కొరకు నాయకుడు
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
చిత్రం : జానీ (2003)
సంగీతం : రమణ గోగుల
రచన : మాస్టార్ జీ
గానం : రమణ గోగుల
*********************************
Naarazu gaaku raa ma annaya....
nazeeru annayaa...mudhula kannayaa...
hey mana roju manakundi annayo...
Movie Name : Johnny (2003)
Music Director : Ramana Gogula
Lyricist : Master Ji
Singers : Ramana Gogula