పల్లవి:
శేషశైలావాస శ్రీ వెంకటేశ
శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా...
శేషశైలావాస శ్రీ వెంకటేశ
చరణం:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు...
అలమేలు మంగకు అలుకరానియ్యకు...
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు.....
అలమేలు మంగకు అలుకరానియ్యకు...
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి...
ముద్దు సతులిద్దరిని ఇరువైపులా జేర్చి...
మురిపించి లాలించి ముచ్చటలు తీర్చి...
శేషశైలావాస శ్రీ వెంకటేశ
చరణం:
పట్టుపానుపుపైన పవ్వలించారా స్వామీ...
పట్టుపానుపుపైన పవ్వలించారా స్వామీ...
భక్తులందరు నిన్ను ప్రస్తుతించిపాడ...
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము...
చిరునగవులోలుకుచూ నిదురించు నీ మోము...
కరువుతీరా గాంచి తరియింతుము మేము...
శేషశైలావాస శ్రీ వెంకటేశ
శయనించు మా అయ్యా శ్రీ చిద్విలాసా...
శేషశైలావాస శ్రీ వెంకటేశ
చిత్రం: శ్రీ వెంకటేశ్వర మహాత్యం (1960)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఘంటసాల