పల్లవి :
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
చరణం : 1
నిన్నటి నీడలే కనుపాపని ఆపితేరేపటి వైపుగా నీ చూపు సాగదుగా॥ నిన్నటి ॥చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూకాళ్లు కడిగి స్వాగతించకూఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవచేయకుమిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదాముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!
చరణం : 2
ఆశలు రేపినా అడియాశలు చూపినాసాగే జీవితం అడుగైనా ఆగదుగా॥ఆశలు ॥నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమాఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమాకలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మాకలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మానవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ! ॥ సంతోషం ॥
చిత్రం : చిరునవ్వుతో... (2000)సంగీతం : మణిశర్మరచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : S.P.బాలసుబ్రహ్మణ్యం **************************************Santosham sagam balam haayiga navvamma
Aa sangeetam nee todai saagave guvvamma
Navve nee kallalo ledaa aa jaabili
Navve mungillalo roju deepaavali
Oho... Oho....
Ninnati needale kanupaapani aapite
Repati vaipugaa nee choopu saagadugaa
Ninnati needale kanupaapani aapite
Repati vaipugaa nee choopu saagadugaa
Chuttamalle kashtamoste kalla neellu pettukuntu
Kaallu kadigi swagatinchakuu
Okka chinna navvu navvi saagananpakunda
Leni poni seva cheyyaku
Minugurulaa mila mila merise darahaasam chaalukadaa
Musurukune nisi vilavilalaadutu parugulu teeyadaa
Navve nee kallalo ledaa aa jaabili
Navve mungillalo roju deepaavali
Oho... Oho....
Aasalu repina adiyaasalu choopina
Saage jeevitam adugainaa aagadugaa
Asalu repina adiyaasalu choopina
Saage jeevitam adugainaa aagadugaa
Ninna raatri peeda kala nedu talusukuntu
Niddra maanukogalamaa
Enta manchi swapnamaina andulone untu
Levakunda undagalamaa
Kalalugani avi kalale ani telisinade telivammaa
Kalatalani nee kila kilato tarimeyyave chilakammaa
Navve nee kallalo ledaa aa jaabili
Navve mungillalo roju deepaavali
Oho... Oho....
Movie Name : Chirunavvutho (2000)
Music Director : Manisharma
Lyricist : Sirivennela Sitarama sastry
Singer : S.P.Balasubramanyam