లాలా ల ల లల లలాలా
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా
నా ఉద్యోగం పోయిందండి
తెలుసు అందుకే !!.
రాలేదు ఈ వేళ కోయిలమ్మ
రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మ
రాగాలె మూగబోయినందుకమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ యెందుకమ్మా
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగతీగ పలికించే వీణలమ్మకి
బహుశా అది తెలుసో ఏమొ
బహుశా అది తెలుసో ఏమొ జాణ కోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేదు ఈ వేళ అందుకేనా అందుకేనా
గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గోంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుశాతను ఎందుకనేమొ
ల ల ల ల ...
బహుశా తను ఎందుకనేమొ గడుసుకోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేనా నీవుంటే కూనలమ్మ
రాగాల పల్లకిలో కోయిలమ్మ
రాలేనా నీవుంటే కూనలమ్మ
చిత్రం : శుభలేఖ (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల