సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు (2)
వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు
చీకటే చెరిగినా
కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోకుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా
తియ్యగా తిడుతూనే లాలించనా
సరసాలు చాలు శ్రీవారు తాన నాన
విరహాల గోల ఇంకానా ఊహు ఊహు
కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగా ఉండనే ఉండడా
ఆరారగా చేరక తీరేదెలా గొడవ
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే రాదా మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగా తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
చిత్రం : శివ (1990)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : మనో , జానకి
********************************************
Sarasalu chalu srivaru vela kadu
Virahala gola inkaanaa veelu kadu
Vantintlo gaaralu vollantaa kaarale saaru
Churukaina eedu vaddanna urukodu
Virajaji pulu vantintlo vadaradu*
Suryude churachura chusinaa
Cheerane vadalaru cheekate chedirinaa
Kakule kekalu vesinaa
Kougile vadalanu vakile pilichinaa
Snananikee saayame ravalane taguvaa
Ne chupule sopuga kavalane saradaa
Papidi teesi poudare pusi
Bayatike pampeyanaa
Paitatobate loniki ranaa
Papalaa paradanaa
Teeyaga tidutune lalinchanaa*
Kottaga mudirina veduka
Mattuga pedavula needake cheradaa
Yenduko tikamaka tondara
Koddiga kuduruga undane undadaa
Araaragaa cheraka teeredelaa godava
Charatame aragaa sayantrame padadaa
Mohame teere muurtame raadaa
Mojule chellinchavaa
Jabile raada jajule tedaa
Ratire ravalika
Agade andaka eedu gola*
Movie Name : Shiva (1990)
Music Director : Ilayaraja
Lyricist : Sirivennela Sitarama sastry
Songs : Mano, Janaki