సాకీ :
శ్రీశైలంలో మల్లన్న - సింహాద్రిలో అప్పన్న
తిరపతిలో ఎంకన్న - భద్రగిరిలో రామన్న
ఆ దేవుళ్ళందరి కలబోత
అయ్యా సామీ నువ్వేనంటా....
పల్లవి :
దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన
మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర... ఓ... మా దొర... ఓ..
చరణం :
సిరులిచ్చే సంద్రమంటే
దైవం మా దొరకి
సెమటోచ్చే వాడంటే ప్రాణం
మా సామికి
మచ్చలేని మనిషిరా
మచ్చరమే లేదురా
ఎదురులేని నేతరా ఎదురులేని నేతరా
చేతికెముకలేని దాతరా
ఎముకలేని దాతరా
ఎదలో నిలుపుకుంటే
ఒదిగిపోవు దేవరా
దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
దండాలయ్యా సామికి
దండలు వేయరా సామికి
దాసుల గాచే సామికి దండకాలు
కొండంతా అండల్లే కొలువైన
మా రేడు కొంగు బంగారైనాడు
ఈ దొర... ఓ... మా దొర... ఓ..
చిత్రం : శుభ సంకల్పం (1995)
సంగీతం : ఎం. ఎం. కీరవాణి
రచన : వెన్నెలకంటి
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం
************************************************
shrishailamlo mallanna
simhadrilo appanna
tirpatilo yenkanna
badhragirilo ramanna
aa devullandari kalabota
ayyaa saamii nuvvenantaa
dandaalayya samiki
dandalu veyaraa samiki
dasula gache samiki dandakalu(dandalayya)
kondantaa andalle koluvaina
ma redu kongu bangarainadu
ee dora....oo...ma dora....oo...
siruliche sandramante
daivam ma doraki
sematoche vadante pranam
ma samiki
machaleni manishiraa
macharame leduraa
yeduru leni netaraa yeduruleni netaraa
chetikemukaleni dataraa
yedalo nilupukunte
odigipovu devaraa (dandalayyaa)
Movie Name : Shubha Sankalapam (1995)
Music Director : M.M.Keeravani
Lyricist : Vennelakanti
Singer : S.P.Balasubramanyam