జనంలోకి వస్తుంది జనవరి ఒకటి
గతంలోకి పోతుంది ముప్పైఒకటి
చిందేయి చిందేయి చిట్టి అమ్మడు
మందేయి మందేయి ఓరి తమ్ముడు
పోయిన ఏడు ఇదేలాగునా సంబరపడ్డాము
యమ welcome చెప్పాము
budget వచ్చి కొంపలు ముంచి వెళ్ళిపోయే భాయి
ఎడాది వెళ్ళిపొయే భాయి
నాయకులంతా ఒకమాటపై నిలిచే ఉన్నారు
పాత పాటే పాడారు
గొర్రెకు బెత్తేడు తొకేనా అని లాగి చూడకోయి
ఉన్నది ఊడిపోవునోయి
దేశం దేశం..అప్పుల కోసం పోటి పడుతూ ఎగబడుతుంటే
నీది నాది ఏముంది అప్పు చెయ్యవోయి..అది తప్పు కాదు భాయి
అప్పే గురువు అప్పే దైవం గొప్ప సూత్రమోయి
గుడ్డ రేటు పెరిగిదంటే కట్టుకోక మానేద్దాము
ఆకు చుట్టుకుందాము
బ్రాంది రేటు పెరిగిందంటే సారా తాగుదాము
నాటు సారా తాగుదాము
తిండికి గింజలు కరువైపొతే తిండి మానుకుందాము
ఎండ్రు గడ్డినే తిందాము
నాగరికతను పక్కకు తోసి గతంలోకి పోదాము
ఆది మానవులమై పోదాము
ఎన్నటికైనా...జమక్ జమక్ జమకు
రెపటికైనా..అర్రే అర్రే అర్రే
లోకంపోకడ ఒకటేలేరా..అందుకే ముందు వెనుక చూడదంటారా
అందిన కొద్ది మందే కోట్టి ముందుకు పోదాం రా
గతాన్ని మరిచే పొదాం రా
చిత్రం : రేపటి కొడుకు (1992)
సంగీతం : కృష్ణ చక్ర
రచన :
గానం : ఎస్.పి.బాలు, వందేమాతరం శ్రీనివాస్