శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటి ని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించీ
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2)
వాలిపోయిన పొద్దులో ఓ దీపమల్లే వెలిగి
రాలిపోయిన ఆశలన్ని రేపిపోయినావే
మోయలేని ఓ పూలకొమ్మకు జీవమంటు పోసి
ప్రాణమిచ్చి ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయ్యినావే
బ్రతుకే పచ్చ తోరణంలా ప్రేమ సాగరములా
మార్చివేసి నను విడిచిపోయినావే
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని (2)
అనుకుంటే ఓ ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే
రాతికైనా నేర్పించుకుంటే మాట పలుకుతుందే
కాటినైనా బ్రతిమాలుకుంటే మంటలార్పుతుందే
ఏనాటికైన సరిదిద్దుకుంటే రాత మారుతుందే
ప్రేమ లోన పడిపోయినాకే మనసు మారుతుందే
మనసే చంపుకోని నేను మరిచిపోయి నిన్ను
అడుగు తీసి అడుగేసి కదులుతుంటే
దూరమని నేను వెళుతు ఉంటే దగ్గరకు మనసు లాగుతుంటే (2)
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేసావే (2)
ఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవో కడలికి కన్నీటి ని తరలించీ
దప్పిక నా మనసుకు మిగిలించీ
ఓ ప్రియా నా ప్రియా నను విడిచీ పోయావే
నీ గమ్యం నీదంటూ యద గాయం చేస్తావే (2)
చిత్రం : నీ తోడు కావాలి (2002)
సంగీతం : వలీష బాబ్జీ & సందీప్
రచన : భాషాశ్రీ
గానం : వలీష బాబ్జీ