అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో...
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం...!
సురకల్పలతా సురభిడ సుమాల
సురు చిర సుమధుర మకరందంతో...
సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం...!
మలయ మహీధర శిఖర వనాంతర
చందన సుఖ శీతల గంధంతో...
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం...!
శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల...
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం...!
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో…
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో...
సాయినాథ నీ తేజోమూర్తికి
అభిషేకం ఊద్యాభిషేకం...!
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం...
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం...
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం...!
భావం :
అమరాతివతిన సంచరించు కామధేను క్షీరంతో (పాలతో ) అభిషేకం
దేవతా పుష్పముల నుండి సేకరించిన తేనెతో అభిషేకం
హిమాలయ శిఖర వనముల నుండి సేకరించిన గంధంతో అభిషేకం
శ్రీహరి పాదాల పుట్టిన గంగా జలంతో అభిషేకం
నీ ధుని నుండి సమీకరించిన, వ్యాధి నిరోధి ఊదితో అభిషేకం
చిత్రం : శిరిడి సాయి (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : కె.శివ దత్తా
గానం : శ్వేతా పండిట్
********************
Amara raama sumaaramacheri Kamadhenu ksheeralatho
Sai nathuni paavana murthi ki Abhishekam ksheerabhishekam
Surakalpa latha Surabida sumala
Sura chera Sumadhura makarandam tho
Sai nathuni Mangala murthi ki Abhishekam madhurabhishekam
Valayavai dhara Sikharavananthara
Chandana sukha Cheethala gandham tho
Sai nathuni Sundara murthi ki abhishekam Chandan abhishekam
Srihari padara jeeva samudbhava
Gagana ganga paavanashekaramula
Sai nathuni srikara murthi ki
Abhishekam neerabhishekam
Neepavayejasameepa dhuneegatha
Aa divyaa nirodhi oodi tho
Neepavayejasameepa dhuneegatha
Aa divyaa nirodhi oodi tho
Sai nathuni tejo murthi ki
Abhishekam poodhyabhishekam
Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam
Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam
Jayaho sai jayam jayam
Nee padakamalamulaku jayam jayam
Movie Name : Shiridi Sai (2012)
Music Director : M.M.Keeravaani
Lyricist : K.Shiva datta
Singer : Shwetha pandit