కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
ఏమౌతుంది
మనిషికి మతి పోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది

నేలవిడిచి సాము చేస్తే మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి
మేడం అర్థమయ్యిందా
నేలవిడిచి సాము చేస్తే మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి
గాలి కోటలు కట్టావు అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టు పై కెక్కావు చచ్చినట్టు దిగమన్నాయి
కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతి పోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది బ్రతుకే శృతి తప్పుతుంది
పిలిని చూసి నక్కలాగా వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు
అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పే అందం ఆడదానికి
చిత్రం : కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం : సత్యం
రచన : ఆత్రేయ
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం