||ప|| |అతడు|
యవ్వనవీణా! పువ్వులవానా!
నువ్వెవరే నా మదిలొ చేరిన మైనా
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా! ||2||
||యవ్వన||
చరణం:
నువ్వంటు పుట్టినట్టు నాకొరకు
ఆచూకి అందలేదు ఇంతవరకు
వచ్చింది కాని ఈడు ఒంటి వరకు
వేధించలేదు నన్ను జంట కొరకు
చూశాక ఒక్కసారి ఇంతవెలుగు
నావంక రాను అంది కంటికునుకు
ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||
చరణం:
ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా నీ లేత నడుమే అనుకున్నా!
ఏ గువ్వ కిలకిల వినపడినా నీ నవ్వులేనని వెళుతున్నా!
మేఘాల మెరుపులు కనపడినా ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో ఆ పొంగులో నీ రూపె చూస్తున్నా
నీ పేరు ప్రేమ అవునా? ఇవాళే నిన్ను పోల్చుకున్నా!
||యవ్వన||
చిత్రం : పెళ్లి (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం