చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు
ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా
డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా
చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీ మూర్తి
రచన : సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం