పల్లవి :
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈనాడు॥అందానికి॥
చరణం : 1
నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపే నీ బుగ్గపై పాకెను॥కళ్లు॥
నీ చేతులానాడు తెరలాయెను
నేడు ఆ తెరలే కౌగిలై పెనవేసెను॥అందానికి॥
చరణం : 2
నీ వేడిలోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
నీ వేడిలోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది
ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంద్రధనుస్సే విరిసింది
ఏడురంగుల ముగ్గులు వేసి
నింగీనేలను కలిపింది
ప్రేమకు పెళ్లే చేసింది
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈనాడు
చిత్రం : జీవన తరంగాలు (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జె.వి.రాఘవులు
గానం : ఘంటసాల, పి.సుశీల