పల్లవి :
నమో నమో బాపూ...మాకు న్యాయమార్గమే చూపు (2)॥నమో॥చరణం : 1
నిరంతరం మా హృదంతరంలో
నిండి వెలుగుజ్యోతి
నిత్యసత్యకాంతి
॥నమో॥
చరణం : 2
ధర్మదేవత నాల్గుపాదములు
బ్రహ్మదేవుని నాల్గువేదములు
ధర్మభూమిలో మరల నిలిపి... ఆ...
నిర్మల బోధలు చేసిన బాపూ
॥నమో॥
చరణం : 3
నీవు తీసిన బాటలు దాటి
నీతిని విడచి నిన్నే మరచి (2)
నీ అనుచరులే మారెదరేమో...
ఓ... ఓ... ఓ...
నీ అనుచరులే మారెదరేమో
నిదురనుండి లేపూ... బాపూ...
॥నమో॥
చరణం : 4
ఆశయాలకై అశువుల బాసిన
అమరమూర్తివయ్యా
నీవు ఆత్మబలముతో ఆదర్శాలు
అవనిలోన నిలుపు బాపూ...
॥నమో॥
బాపూ....
చిత్రం : ఎం.ఎల్.ఎ. (1957)
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.సుశీల, మాధవపెద్ది సత్యం, బృందం