పల్లవి :
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం : 1
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలతోన
కన్నులలోన దాగెనులే వెన్నెలతోన
చకోరమై నిను వరించి
అనుసరించినానే కలవరించినానే
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చరణం : 2
నా గానములో నీవే... ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే... పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే
నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
రచన : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల
*****************************************
Movie Name : Devaraya (1962)
Music Director : Saluri Rajeswara rao
Lyricist : SriSri
Singer : Ghantasala