పల్లవి :
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
ఆ మాటలు ఏమైనవి? అహా! అయ్యగారు ఓడారులే..
ఉహు..ఉహు...
పెళ్ళాడనిదే ప్రేమించనని తెగ లెక్చరు దంచావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..
నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది? అహ! నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
చరణం 1:
శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే...
శ్రీరంగనీతులు చెప్పావులే చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా ఆహా అందమెంతొ చిందేనులే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
చరణం 2:
ఈ సొగసు నవ్వి కవ్వింతులే... నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే....
అహ...నను వీడి పోలేవులే....
చరణం : 3
పైపైన మెరుగులు కొన్నాళ్లవే మదిలోన మమతలు పూయాలిలే...
వయ్యారమే ఒలికించినా అయ్యగారు చలియించరు..
ఆహా! అయ్యగారు చలియించరు ...
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే...
నీ మాటకు.. నీ చేతకు.. అహ అంతు పొంతు లేదాయలే..
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
చిత్రం : ఆత్మగౌరవం (1966)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రచన : ?
గానం : ఘంటసాల, సుశీల
***************************************************
Movie Name : Atma Gowravam (1966)
Music Director : Saluri Rajeswara rao
Lyricist :
Singers : Ghantasala, P.Susheela